రిజర్వేషన్ల జోలికి వస్తే లంబాడీల సత్తా చూపిస్తాం…

రిజర్వేషన్ల జోలికి వస్తే లంబాడీల సత్తా చూపిస్తాం…

 

అనిల్ నాయక్ – ( లంబాడి ఐక్యవేదిక యూత్ ఇంచార్జి కామారెడ్డి జిల్లా)..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 14 (అఖండ భూమి న్యూస్) బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొంతమంది ఆదివాసీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదని ఆదివారం *కామారెడ్డి జిల్లా లంబాడీ ఐక్యవేదిక యూత్ ఇన్చార్జి అనిల్ నాయక్ ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆదివాసి నాయకులు స్వలాభం కోసం గిరిజనుల మధ్య తగాదాలు పెట్టొద్దని సూచించారు. బంజారా నాయకుల మీద చేస్తున్న దుష్పర్చారాన్ని మానుకోవాలన్నారు. బంజారాలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తొలగించాలన్న ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించే న్యాయమైన హక్కుల కోసం లంబాడీలు కట్టుబడి తన ఆకులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లంబాడి హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!