ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం…
రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 14 (అఖండ భూమి న్యూస్)
ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మైనారిటీ ఫంక్షనాల్లో ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగిందని ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గయాజుద్దీన్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ లు పేర్కొనడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు,జమీల్ లు మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని లేవని రక్తదానం పట్ల అపోహలను విడనాడి రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు.మహమ్మద్ ప్రవక్త బోధించిన నీతి న్యాయం ధర్మం సమాజ సేవ అనే సూత్రాలను నిజజీవితంలో పాటించి సన్మార్గంలో నడవాలని అన్నారు సేవా మార్గంతోనే మానవ జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని అన్నారు.రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు గయాజుద్దీన్ మరియు కమిటీ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ శిబిరంలో 22 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యకులు ముక్రం, సయ్యద్ మీర్,అజీజ్ రెహమాన్,అహ్మద్ పాషా,కమిటీ సభ్యులు,ముస్లిం యువత పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



