చిగురంత ఆశ

చిగురంత ఆశ

జగమంత వెలుగు

 

మనిషి ఆశాజీవి

రేపటి మీద ఆశ

నేటి కష్టాలనుఓర్చుకొని

ణఙఓపికను నేర్పుతుంది

 

నెరవేరుతాయనే ఆశ

ముందుకు నడిపిస్తుంది

ఆశ పోరాట పటిమనిస్తుంది

ఆశ ఆత్మవిశ్వాసాన్ని

కలిగిస్తుంది

 

ఆశ అభివృద్ధికి మెట్టు

ఆశ ఆశయాలకు

ఆలంభణ

ఆశలు ఆశ్వాల వంటివి

అధుపుతప్పితే బతుకు

అగమ్యగోచరం

 

అత్యాశ నిరాశ ప్రగతికి

ప్రతిబంధక మౌతుంది

దురాశ దుర్బుద్ధిని

ఆశ్రయించిన వారు

నాశనం వైపు వెలతారు

 

ఆశ మనిషికి తీరని తృష్ణ

సముద్రంలో అలలు

కడుపులో ఆకలి

చెరువులో చేపలు

మనసులో ఆశలు

మళ్ళీ మళ్ళీ పుడతాయి

 

మనిషి కోరికల పుట్ట

కోరికలు అపరిమితం

కోరికలు పరస్పరం

పోటీ పడతాయి

 

ఆశనేరవేరితే ఆనందం

ఆశలు విఫలమైతె నిరాశ

ప్రకృతిలో ప్రాణికోటికి

ఉచ్ఛ్వాస నిశ్వాసలు

ఎంత సహజమో

మనిషికి ఆశ నిరాశలు

కూడా అంతే సహజం

 

ఆనందకరమైన జీవనానికి

థనంతో పాటు

స్నేహం నమ్మకం ప్రేమ శాంతి

ఆత్మీయత అనురాగం కావాలి

ఆశ బలంగా వుంటే

కోల్పోయిన ఆనందానికి జీవం పొయవచ్చు

 

చిగురంత ఆశ

జగమంత వెలుగు

సానుకూల దృక్పథం

అత్యాశ దురాశలకు

దూరంగా ఉంటూ

నిరాశ నిస్పృహను

థరిచేయనీయక

ఆశనే శ్వాసగా

ముందుకు సాగాలి

నేదునూరి కనకయ్య

ఫ్రీలాన్స్ రచయిత సామాజిక ఆర్థిక విశ్లేషకులు

కరీంనగర్9440245771

Akhand Bhoomi News

error: Content is protected !!