తెలంగాణ కుమ్మర సంఘం 880/ 2014
తెలంగాణ రాష్ట్ర శాఖ
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యునిగా విశేష ప్రతిభ కనబరిచిన న్యాయ నిపుణులు రాజ్యాంగ తుది ప్రతిపై డాక్టర్ అంబేద్కర్ గారితో కలిసి సంతకం చేసిన ఏకైక బీసీ కుమ్మర కులానికి చెందిన రత్నప్ప కుంబార్ కావడం కుమ్మర్లకు గర్వకారణం అని కుమ్మర కుల ఔన్నత్యాన్ని ప్రతిభ పాటవాలను దేశ చరిత్రలో నిపడడం అభినందయమని కుమ్మర సంఘాల నాయకులు బీసీ ఉద్యమ కారులు యువత సమాజ మార్పును కోరుకునే వారు రత్నప్ప కుంభార్ సేవలు స్పూర్తిగా తీసుకొని బీసీ ల సమాజిక ఆర్థిక.విద్య వైద్య వైజ్ఞానిక రంగాల్లో పురోగమించాలని తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర అధ్యక్షులు రచయిత కాలమిస్ట్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు.
నేడు తెలంగాణ కుమ్మర సంఘం880/2014 రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్రశాఖఆధ్వర్యంలో
స్వతంత్ర సమరయోధులు మాజీ మంత్రి దేశభక్త రత్నప్ప కుంభార్ 116 వ జయంతి వేడుకలు నిర్వహించారు.
జయంతి వేడుకలకు నేదునూరి కనకయ్య అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కుమ్మర ఆత్మ గౌరవ భవన్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు కొల్లూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ రత్నప్ప కుంభార్ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వారు చేసిన విశేషమైన సామాజిక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1985 లో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కుమ్మర సమాజానికి బీసీ సమాజానికి అరుదైన గౌరవం అని స్వాతంత్ర్య ఉద్యమం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని బట్టి దేశభక్త రత్నప్ప కుంభార్ అని పిలిచే వారని వారు చేసిన సేవలను కొల్లూరి అనిల్ కుమార్ కొనియాడారు.
తెలంగాణ కుమ్మర సంఘం లీగల్ అడ్వైసర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది మలికంటి వెంకన్న మాట్లాడుతూ రత్నప్ప కుంభార్ గొప్ప న్యాయవేత్త రాజకీయవేత్త గా సామాజంలోగణనీయమైన సేవలు అందించారని శాసన సభ్యుడిగా మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆహార పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు.
ఈ సమావేశము రత్నప్ప కుంభార్ ఆశయాల సాధనకు కృషి చేయాలని తీర్మానించింది. ఈ సమావేశములో తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు. ఉపాధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి వివిధ విభాగాల అధ్యక్షులు మలికంటి సిద్ధయ్య కే శంకర్ ధరినిధర్ నాంపల్లి శంకర్ నమిలకొండ ప్రభాకర్ రాష్ట్ర అడ్వైసర్ తీగుళ్ల యాదగిరి డాక్టర్ వాసరవేణి పరశురామ్ ఎం కుమార్ మల్కాజిగిరి కుమార్ వెంకటేష్ రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు కే కృష్ణ తదితరులు హాజరైనారు.
ఇట్లు
నేదునూరి కనకయ్య అధ్యక్షులు తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 కొల్లూరి అనిల్ కుమార్ తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ 9440245771