మెగా రక్తదాన శిబిరం విజయవంతం..

మెగా రక్తదాన శిబిరం విజయవంతం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదినం సందర్భంగా 96 యూనిట్ల రక్త సేకరణ…

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 17 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవనజ్యోతి సేవా సంఘం, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 వ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 96 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు, జమీల్ హైమద్ లు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప రాజకీయ చతురత కలిగిన మేధావి భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ప్రపంచంలో వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని,96 మంది రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని రక్తదానం చేసిన వారి ప్రాణాలను కాపాడాలని,ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఉద్దేశంతో రక్తదాతలకు హెల్మెట్లను అందించారు.

ఈ శిబిరంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.రక్తదాతలకు కామారెడ్డి రైల్వే ఎస్ఐ సాధు లింబాద్రి ప్రశంస పత్రాలను,హెల్మెట్ లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి,ఎస్సై సాధు లింబాద్రి లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ కె కళాశాల ప్రిన్సిపాల్ అమృత దత్తాద్రి,సాందీపని డిగ్రీ కళాశాల అధ్యాపకులు సురేష్,ప్రభాకర్ బద్దం నిశాంత్ రెడ్డి,జీవన్,వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!