తల్లికి వందనం,ఆమె అమృత తుల్యం…
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17,(అఖండ భూమి న్యూస్) స్త్రీ కి ప్రసూతి పునర్జన్మతో సమానం.ఆ మాతృత్వపు అనుభవాలు ఒక్కొక్క నేల
ఒక విధంగా ఉంటాయి.అందుకే
భారతీయ సంస్కృతి మాతృ దేవో భావ అని ఉటంకించిం ది.బ్రహ్మ సృష్టిస్తే పునర్జన్మని చ్చేది స్త్రీ.చర చర సృష్టి లో అమ్మతనం లోని దశలను తెలుసుకుందాం. తల్లికి వదనం తల్లి అనుభవాల్ని వ్యక్తపరచే లా ఉంటాయి. అవిమొదటి మాసం. జీవకణమందు జ్యోతిర్దీపమై,కొత్త ప్రాణం పులకరించెను.
రెండో మాసం
తల్లి గర్భమందు తారకై,
అవయవములు రూపు దాల్చెను.మూడో మాసం
పొలికే గుండె ధ్వనియై,
తల్లి చెవులు ఆనందించెను.
నాల్గవ మాసం చిన్న చెయ్యు లు, కాళ్ల పొంగులుతో,కలల కొలిమిలో రూపమయ్యెను.
ఐదో మాసం,తల్లి గుండెలో తడిమినట్టై,బిడ్డ కదలికలు మొదలయ్యెను.ఆరవమాసం
పెరుగెను శరీర మమతలతో,
ప్రకృతిఅమృతం పోసెను లోపల.ఏడో మాసంవార ధి దాటి వెలుగురాక,తల్లి హృద యం మధురమై పొంగె.
ఎనిమిదో మాసం
ప్రతీ శ్వాసలో పులకింతలై,
బిడ్డ శరీరము నిండె శక్తితో.
తొమ్మిదో మాసం
సంతోష కన్నీరు నిండినదై,
జన్మనందించే తల్లి మహిమ.
భావంగర్భధారణ తొమ్మిది నెలలలో తల్లి అనుభవించే దశలను వర్ణిస్తాయి. జీవకణం నుండి జన్మ వరకు అది ఒక అద్భుత యాత్ర.