ఎస్ బి ఆర్ఎఫ్ సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 17 (అఖండ భూమి న్యూస్) ఇటీవల జిల్లాలో కురిసిన అధిక వర్షాలతో సంభవించిన వరదల సందర్భంగా జిల్లాలో తమ అత్యుత్తమ సేవలను అందించిన ఎస్బిఆర్ఎఫ్ సిబ్బందిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అభినందించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఎస్డిఆర్ఎఫ్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కలవగా జిల్లా కలెక్టర్ వరదల సమయంలో వారు అందించిన సేవలను కొనియాడారు. జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు.