కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం…

కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 17 (అఖండ భూమి న్యూస్) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. కామారెడ్డి పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం కలెక్టరేట్ లో పోలీసు వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ గావించి ప్రజలను ఉద్దేశించి నిజాం నిరంకుశ రాజరిక పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవించిన బాధలనుండి విముక్తి పొందారు. తెలంగాణ సాయుధ పోరాటం , ఇతర ప్రజా ఉద్యమాల ద్వారా విముక్తి పొంది 17 సెప్టెంబర్ 1948లో పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై తెలంగాణ ప్రజలు పొందినారు. స్వేచ్ఛ స్వాతంత్రం తీరు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లాలో అమలు గురించి జిల్లా ప్రజలనుద్దేశించి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి. ప్రసంగించారు.

ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే హాస్పిటల్ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, కామారెడ్డి ఆర్డిఓ వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!