కేరళను వణికిస్తున్న ‘మెదడును తినే అమీబా’.. ఈ ఏడాది 18 మంది మృతి..,!
కలవరపెడుతున్న అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్..
ఈ ఏడాది 67 కేసుల నమోదు, 18 మంది మృతి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 17 (అఖండ భూమి న్యూస్) తాజాగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో 17 ఏళ్ల కుర్రాడికి వ్యాధి నిర్ధారణ అనుమానంతో స్విమ్మింగ్ పూల్ మూసివేసిన అధికారులు
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’ అనే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేరళలో కలకలం రేపుతోంది.
‘మెదడును తినే అమీబా’గా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్‌కు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 18కి చేరింది.
తాజా కేసు విషయానికి వస్తే, బాధిత కుర్రాడు తన స్నేహితులతో కలిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశాడు. ఆ మరుసటి రోజే అతడికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసివేసి, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు.
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 14న విడుదల చేసిన గణాంకాల ప్రకారం