వృద్ధులను భారంగా కాదు, బాధ్యత గా చూడాలి…

వృద్ధులను భారంగా కాదు, బాధ్యత గా చూడాలి…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 30,(అఖండ భూమి న్యూస్) నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం.వృద్ధుల ఆరాధన, సంరక్షణ, వారి అనుభవాలకు గౌరవం ఇవ్వడం కోసంయూ.ఎన్.ఓ1990 నుంచి ఈదినోత్సవాన్ని ప్రకటించది. వృద్ధులు సమా జానికి అనుభవ సంపద.వారు వారు జీవితంపొడువునసాధిం చిన జ్ఞానం,విలువలు మన తరానికి మార్గదర్శకం. అయి తే ఆధునిక కాలం లో వారిపై శారీరక,ఆర్ధిక,మానసికఒత్తిడు లుపెరిగాయి. వృద్ధప్యం లో ఇంటి నుంచి గెంటివేయడం, హత్యలు కూడా చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థలో మార్పులు రావడం ఉమ్మడి కుటుంబాలు నశించి, వ్యష్టి కుటుంబాలు వచ్చి వృద్ధులను దూరంగా ఉంచుతున్నారు. వృద్దులకు ఆరోగ్య సమస్యలు,హింస వం టి సమస్యలు పెరుగుతున్నా యి. ఈ రోజు వృద్ధుల సమస్యలపై అవగాహన పెంచడం, వారి హక్కులను రక్షిండం, వారిని సమాజం లో గౌరవప్రద స్థితిలో

ఉంచడం నేటి ఉద్దేశం. వారి సంరక్షణ, వృద్ధులు సమా జానికి అనుభవసంపద.వారు జీవితం పొడువున సాధించిన జ్ఞానం, విలువలు మన తరానికి మార్గదర్శకం. దేశరాజ్యాంగంలో ఆర్టికల్1 ప్రకారం వృద్ధులు,బలహీనుల కు సహాయం చేయాలని అదేశిక సూత్రాలు, 46 ప్రకారం బలహీన వర్గాలు వృద్దులకు రక్షణ,వారి రక్షణ కొరకు ఓల్డ్ ఏజ్ హోమ్ లు ఏర్పాటు హిందూ అవిభాజ్య కుటుంబ చట్టం 1956 హిందు పిల్లలు తమ తల్లిదండ్రులకు భరణం ఇవ్వవల్సిన బాధ్యత కలిగి ఉంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 వారి పిల్లల నుండి న్యాయపరంగా భరణం కొరవచ్చు .అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్ పథకాలు ఆరోగ్య సంక్షేమ పథకాలు సీనియర్ సిటిజన్ద్వారా ప్రత్యేక సదుపాయాలు రైల్వేలో బస్సు ల్లో దేవస్థానం దర్శనాల్లో ప్రత్యే కసదుపాయాలు కల్పిస్తున్నారు. వృద్ధులు మనకు నీతి అనుభవం జ్ఞానానికి ప్రతిరూపం. వారిని గౌరవించడం రక్షించడం మన సమాజ ధర్మం .చట్టాలు పథకాలు ఉన్నప్పటికీ నిజమైన మార్పు కుటుంబం మరియు సమాజం వారి ప్రేమతో అంగీకరించినప్పుడే వస్తుంది. ప్రపంచంలో ఏ మతమైనా ఏ సాంప్రదాయమైన వృద్ధులను గౌరవించాలని చెబుతుంది. వారు లేనిదే మనం లేమని స్పృహ అందరికీ ఉండాలి. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అంటే వృద్ధుల పట్ల ఆదరణ తగ్గుతున్నట్టు లెక్క శ్రవణకుమా రుడు వృద్ధులైన తల్లిదండ్రులను తీర్థయాత్రలు తీసుకెళ్లినట్టు చదువు కున్నాం. ఆధ్యాత్మిక ధర్మం కూడా వృద్ధులను గౌర వించాలని చెప్తుంది. యద్భావం తద్భవతి నీవు నీ వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన తీరే నీ ద్వారా వచ్చిన నీ పిల్లలు కూడా అలవర్చుకుంటారు. అందుకే ఇది పూర్తిగా నైతికమై న మానసికమైన చర్య చాలా కుటుంబాల్లోని వృద్ధులు తమ సమస్యలను చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. రోజు పత్రికల్లో వృద్ధులపై దాడులను ఏదో రూపంలో చూస్తున్నాం. అంతరిక్షంలో విహరిస్తున్న పునసృష్టి చేసే శక్తిని కలిగి ఉన్న నైతిక విలువ లు నశించినప్పుడు సమాజం బాగుండదు. అందుకే వృద్ధుల నుగౌరవించుట అంటే వారి ఆలోచనలను అభివృద్ధిని సంస్కృతిని మన పిల్లలకి అందియడమే.రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఉద్యోగు ల జీతాల నుండి వృద్ధులైన తల్లిదండ్రులకు 10 శాతం వేతనం ఇవ్వడం చాలా సంతోషకారం,అయితే ఉద్యోగుల తమ వృద్ధులైన

తల్లిదండ్రులను దూరంగా ఉంచితే కఠినమైన శిక్షలు వేయాలి. ఇంకొక విచిత్ర విషయం ఇంట్లో నలుగురు అని ఐదుగురు కొడుకులు ఉంటే వారి భారాన్ని ఒకరి మీద నెట్టేసుకుంటూ బాధ్యత నుంచితప్పించుకుంటున్నారు.భయంకరమైన విషయం ఏమి టి అంటే వృద్ధాప్యంలో తల్లి ఒక్కదగ్గర, తండ్రిని ఒక్కదగ్గర ఉంచి బతికి ఉండగానే మాన సికంగా చంపేస్తున్నారు. వృద్ధు లు కూడా పూర్తిగా తమ పిల్లల ను నమ్మకుండా ఆస్తుల విష యంలో కానీ ఇతరత్రా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఆవశ్యం.

Akhand Bhoomi News

error: Content is protected !!