నేడు ప్రపంచ సంగీత దినోత్సవం..!

నేడు ప్రపంచ సంగీత దినోత్సవం..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 30,(అఖండ భూమి న్యూస్) ప్రపంచంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకుంటారు 1975లోయునెస్కో ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు సంగీతం మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇది మనసుకు ప్రశాంతత నిచ్చే అనారోగ్యం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలను ఏకం చేసే విశ్వవ్యాప్త భాషగా పరిగణించబడుతుంది. సంగీతం ద్వారా మనిషి భావాలను వ్యక్తపరచగలరు ఇది భాషా జాతి మత దేశభేదాలను అధిగమిస్తుంది. ఒత్తిడి నిరాశ వ్యాధులను తగ్గించడంలో సంగీతం సహాయకారి విద్య సంస్కృతి ఆధ్యాత్మికత వినోద రంగాల్లో సంగీతం విశేష ప్రాధాన్యత కలిగింది సంగీత దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం శాంతి సౌబ్రాతృత్వంపెంపొందించడం ప్రజల మధ్య సంస్కృతిక మార్పులు జరగడం కొత్త ప్రతిభలకు వేదిక కల్పించడం యువతలో సంగీతం పట్ల ఆసక్తి పెంచడం సంగీతం మనసులు మలిచే శక్తివంతమైన సాధనం అది ఆనందాన్ని పంచి మానవ సమాజాన్ని కలిపే బంధం కాబట్టి ప్రపంచ సంగీత దినోత్సవం మనకు సంగీతం యొక్క విలువ దాని విశ్వ జననీతను గుర్తుచేస్తుంది. సంగీతం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది ధ్యానానికి సహాయం చేస్తుంది శాస్త్రీయ పరిశోధనల ప్రకారం మ్యూజిక్ థెరపీ అనేక వ్యాధులకు చికిత్స అందించడంభారతీయ సంగీతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది సామవేదం నుండి ప్రారంభమైన ఈ సాంప్ర దాయం ఈరోజుకి ప్రపంచవంతటా విస్తరించింది హిందుస్తానీ మరియు కర్ణాటక శాస్త్రీయ సంగీతం ప్రపంచానికి ఎంతో గౌరవం తెచ్చాయి. త్యాగరాజు అన్నమయ్య మొజార్ట్ జాబ్ మార్లి వంటి మహానుభావులు సంగీత ప్రపంచానికి చిరస్మరణీయమైన కీర్తి తెచ్చారు. కర్ణాటక సంగీతంలో విశేషమైన కృషి చేసిన కీర్తిశేషులు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి భారతరత్నగా కీర్తి నొందిది. 64 కళలల్లో ప్రత్యేక మైనది.

Akhand Bhoomi News

error: Content is protected !!