నేడే విజయదశమి (దసరా) పండుగ..!  పాలపిట్టనుఎందుకుచూస్తారు.

నేడే విజయదశమి (దసరా) పండుగ..!

పాలపిట్టనుఎందుకుచూస్తారు..

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 1, (అఖండ భూమి న్యూస్ ).;

నేడే విజయదశమి,పాల పిట్టను ఎందుకు చూస్తారు?

భారతదేశంలో మైసూర్,ఈశాన్య భారతంలో , తెలుగు రాష్ట్రాలలో విజయదశమి దసరాను ఘనంగా జరుపుకుంటారు. దాని వెనుక ఉన్న కథను మనం గమనిద్దాం, గమనిద్దాం దేవదానవులు పాల సముద్రమునుమ ధించి నప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈవిజయ దశమి రోజే అని తెలియజేయబడింది. శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీ యుజ దశమికి విజయా ‘అనే సంకేత మున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అను పేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము ,తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆకార్యమున విజయము తధ్యము.చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయవేళనే’ విజయం’అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచి తార్ధసాధకమైనని గురువాక్యము అని గమనించలి శమీపూజ’ చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. క్షవృక్షమంటే ‘జమ్మిచెట్టు’ అజ్ఞాతవాస మందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాత వాసము పూర్తి అవగానేఆవృక్ష రూపమును పూజించి ప్రార్ధించి తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది ,శమీవృక్షరూపము న ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీ స్సులుపొంది ,కౌరవులపైవిజయము సాధించినారు. శ్రీరాము డు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా’ దేవిని పూజించి ,రావణుని సహరించి ,విజయముపొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ ను చూ చే ఆచారం కూడా ఉన్నది.ఇ లా అందరూ నవరాత్రులు జ రుపుకుని , విజయదశమి రో జు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం జమ్మిచెట్టు వద్దగల అపరాజి తాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు. శ్లో” శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ !అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీపై శ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తా రు. ఇలా చేయుటవల్ల అమ్మ వారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుం దని ప్రతీతి .తెలంగాణలోపాల పిట్టను చూసి జమ్మి వృక్షానికి పూజ చేస్తారు.కొన్ని గ్రామాల్లో కొందరి ఇండ్ల ముందు గుమ్మడి కాయలు కొన్ని ప్రాంతాలల్లో మేకలు గొర్లను బలి ఇవ్వడం ఆనవాయితి.డప్పు చప్పట్లతో ఊరు పెద్ద అద్వర్యం లోపాల పిట్ట దర్శనానికి వెళ్ళి అది కని పించ గానే పాల పాల అంటూ చప్పట్లతో ఆనందాన్ని పంచు కొని పరస్పరం ఆలింగనంచేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు.అలయియిచెప్పుకుంటు బంగారం ఇచ్చిపుచ్చుకుంటరు.తెలంగాణ ఎంత పేద

వారు అయిన కొత్త బట్టలు వేసుకొని దవత్ చేసుకుంటూ

ఆనందంగా గడుపుతారు.

Akhand Bhoomi News

error: Content is protected !!