ఖార్జుర పండు తింటే ఆరో గ్యానికి ఎంతో మేలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; అక్టోబర్ 6,(అఖండ భూమి న్యూస్);
చలికాలంలో ఖర్జూరాలను రోజూ తినాలి. ఉదయాన్నే పరగడుపునే 4 ఖర్జూరాలను తింటేచాలు. కాలంమారుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉం టుంది. దీంతో ఎలాంటి అనా రోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవ టం వల్ల వీలైనంత వరకు మనశరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే చలికాలంలో ఖర్జూరాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాలను తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఖర్జూరాలను పోషక విలువల రారాజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఖర్జూరాలు ఒక వరం. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూ రాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే రక్తం బాగా తయారవుతుంది. .ముందు రోజు రాత్రి ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ప్రతి రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల గుండె సమస్యలు మీద చాలామంది మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలతో సతమతం అవుతుంటారు. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి రెండు లేదా మూడు ఖర్జూరాలను తిని పడుకోవడం ద్వారా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా జీర్ణక్రియను మెరుగు పరుచుకోవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. సుఖ విరేచనం అవుతుంది. చలికాలంలో ప్రతి ఒక్కరినీ దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో సతమత మయ్యేవారు ఒక గ్లాస్ నీటిలో రెండు ఖర్జూరాలు, 5 నల్ల మిరియాలు వేసి బాగా మరిగించి ఆ తర్వా త ఆ నీటిని వడబోసి తాగటం ద్వారా.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్. ఆస్త మాసమస్యతో సతమతమయ్యే వారికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బాలింతలు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా ఖర్జూరాలతో ఎన్నో ప్రయోజనాల ను పొందవచ్చు.సుగర్ పేషెంట్స్ డాక్టర్ సలహాతో వాడాలి.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


