ప్రజలకు అధిక వర్షాలతో ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
అధిక వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ముందస్తు చర్చలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి పట్టణంలో ఉదయం నుండి కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో గతంలో ముంపునకు గురైన GR కాలనీలలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్రెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి పర్యటించి ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం వలన జి ఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న నీటి ఉద్రితిని ప్రత్యక్షంగా పరిశీలించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గతంలో భారీ వర్షాల వలన కలిగిన ఇబ్బందులను, నష్టాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండి కాలనీవాసులను అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలను చేపట్టవలసిందిగా అధికారులను ఆదేశించినారు. జి ఆర్ కాలనీతో పాటు కామరెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నింటిలో అధికారులు పర్యటిస్తూ అధిక వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


