ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు…

బెల్లంపల్లి అక్టోబర్05(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాకా వెంకట స్వామి 96వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏఎంసీ చౌరస్తాలో గల కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు,అనంతరం బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకా చిత్ర పటానికి పూలమాలు వేసి కేక్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమకారుడిగా సింగరేణి కార్మికులకు సింగరేణి భాంధవుడిగ,కార్మిక పక్షపతిగా,పేద ప్రజలకు గూడు కల్పించి గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్న ఘనత ఒక్క వెంకటస్వామి కే దక్కుతుందని,కార్మిక శాఖ మంత్రిగా సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు పింఛన్ పథకం తెచ్చి సింగరేణి భాంధవుడిగా కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.కాకా వెంకటస్వామి రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…


