భారీ వర్షాలతో నష్టపోతే, ఇటువైపు చూడని హరీష్ రావు ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు…

భారీ వర్షాలతో నష్టపోతే, ఇటువైపు చూడని హరీష్ రావు ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు…

 

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 6 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టాన్ని చవి చూసిందని. రైతుల పంటలు మునిగి నాశనం కాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే ఇటువైపు చూడని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. ఈ కష్టకాలంలో ప్రజల బాధలో పాలుపంచుకోవాల్సిన సమయంలో హరీష్ రావు “కాంగ్రెస్ పార్టీని మట్టికలిపిస్తాం” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి అన్నారు.కష్టాల్లో ఉన్న రైతుల దుఃఖాన్ని రాజకీయ లాభం కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరదల ప్రధాన కారణం — మైనర్ ప్రాజెక్టులు , మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు చిన్న ప్రాజెక్టుల అభివృద్ధి పట్ల అసలు దృష్టి పెట్టలేదు అని ఆరోపించారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ సిల్ట్ రిమూవల్, స్ట్రెంథెనింగ్ పనులు సమయానికి చేయకపోవడం వల్లే ఈ వరదలు భారీ నష్టం కలిగించాయి అని అన్నారు. సుమారు 10,000 ఎకరాల పంటలు నష్టపోయాయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు.

పోచారం ప్రాజెక్ట్ పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి నుండి మా పోచారం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి మట్టి సంచులు నింపి, త్రిలింగేశ్వర స్వామి దయతో కాపాడుకున్నారనీ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు చూపిన శ్రద్ధను ఎల్లారెడ్డి ప్రాంతంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై చూపలేదు. మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా కాళేశ్వరం అవినీతి, హరీష్ రావు పాత్ర గురించి బహిరంగంగా వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు.

మీరు నన్ను మీ కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే, నేను వచ్చి ఎల్లారెడ్డి ప్రజలకు మీరు చేసిన ద్రోహాన్ని చూపించి ఉండేవాడిని. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి లేకపోవడం మీ పాలన వైఫల్యం గుర్తు చేస్తుందన్నారు.

100 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్ట్‌ను నేను కాపాడాను. ఇది ఎల్లారెడ్డి ప్రజల జీవనాధార ప్రాజెక్ట్ అని అన్నారు.

మీ సొంత ఊరు నల్లమడుగులో ఒక చిన్న మోరీ కూడా సరిగా నిర్మించలేని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఈరోజు “వరల్డ్ బ్యాంకు పోయిండు ” అంటూ చిల్లర కామెంట్లు చేస్తున్నారనీ విమర్శించారు.

“గజరాజు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి” — మేము ఎల్లారెడ్డి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం, ఇలాంటి మాటలతో మాకు భయం లేదనీ అన్నారు.

ఎల్లారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజలకు భరోసా ఇచ్చారు.

మా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ, మార్గదర్శనం చేస్తున్నారు అని అన్నారు. ఆయన నాయకత్వంలోనే ఎల్లారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం కృషి కొనసాగుతుంది అన్నారు.

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినట్టు పుత్ర రత్నాల” కుటుంబ సభ్యులకు మాత్రమే హక్కులు కల్పించే దొర పరిపాలన ఇక ఉండదు. ప్రజలే అధికారం, ప్రజలకే ప్రాధాన్యం అని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!