*అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వృద్ధునికి ప్లేట్ లెట్స్ అందజేత*
*సకాలంలో రక్తదానం చేసిన రక్తదాతలకు అభినందన*
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 6 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల్ల గ్రామానికి చెందిన నారాయణ (68) కు అత్యవసరంగా ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డి లో మూడు యూనిట్ల తెల్ల రక్త కణాలు అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో రక్తదాతలు రాకేశ్,మణికంఠ,జగదీశ్వర చారి ల సహకారంతో తెల్ల రక్తకణాలను కాలంలో అందజేయడం జరిగిందని అన్నారు.ఒక వ్యక్తి చేసే రక్తదానంతో ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చు అని ఒక యూనిట్ రక్తం నుండి ప్లాస్మా,తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలను వేరు చేయడం జరుగుతుందని అన్నారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించుకొని ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలని రక్తదానం చేసిన రక్త దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్,ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ లు పాల్గొనడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


