సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి సీజెఐ గవాయ్ పై మతోన్మాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం…
– సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 6 (అఖండ భూమి న్యూస్);
రాజ్యాంగ బద్దమైన న్యాయవాద వృత్తిలో ఉన్న ఒకలాయర్ గౌరవ అత్యున్నత న్యాయ వ్యవస్థకు భంగం కలిగే విధంగా
ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సీజెఐ గవాయ్ పై చెప్పుతో దాడికి యత్నించడం సిగ్గుచేటని
అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కామారెడ్డి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
దేశంలో దర్మం పేరుతో అధర్మంగా దాడులు చెయ్యడం ఏమిటని అన్నారు.
ఈ దేశంలో సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయ మూర్తికే రక్షణ లేదంటే అణగారిన వర్గాలపై వివక్ష, దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నయో అర్థం అవుతుందని అన్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకున్న మతోన్మాదులు దళితులపై అనేక రకాలుగా అఘాయిత్యాలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగం అంబేద్కర్ చిల్లర ప్రజలను నెత్తికెక్కించుకున్నావని అంటూ ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి మాట్లాడటం చూస్తుంటే ఆ లాయర్ ఎంత ఉన్నాదిలా మారాడో తెలుస్తుందని అన్నారు.
న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించిన అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పై స్పందించాలని
ప్రధానన్యాయ మూర్తిపై చెప్పు తో దాడికి పాల్పడిన
ఆ లాయర్ ను న్యాయవాద వృత్తినుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.
సుప్రీంకోర్ట్ ప్రధానన్యాయ మూర్తి పై దాడిచేయడం అంటే, దేశ న్యాయ వ్యవస్థ పై,
*ఈ దేశ రాజ్యాంగం పై దాడి చేసినట్లే అని అన్నారు.
ఈ సంఘటన దేశంలోని షెడ్యూల్డ్ కులాల మనోబావాలను ఎంత గానో గాయ పరుస్తుంది అని అన్నారు. తక్షణమే బీజేపీ ప్రభుత్వం… చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


