నేడు అంతర్జాతీయ తపాల దినోత్సవం…

నేడు అంతర్జాతీయ తపాల దినోత్సవం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8,( అఖండ భూమి న్యూస్) తపాల వ్యవస్థ మన జీవితం లో భావోద్వేగ బంధాలకు సమాచార ప్రాప్తికి వాణిజ్యానికి ముఖ్యమైన మాధ్యమం. డిజిటల్ యుగంలో తపాలాసేవలు తమ విలువలను నిలబెట్టుకుంటున్నాయి. అంతర్జా తీయ తపాలాదినోత్సవంమన కు ఆనిబద్ధత సేవాభావాన్ని గుర్తుచేస్తుంది ఈరోజుఅంతర్జా తీయతపాలాదినోత్సవం.1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్ లో ని బెర్న్ పట్టణంలోని యూని వర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది.ఈ సంస్థ స్థాప నతో ప్రపంచంలోని దేశాలు ఒకే విధమైన తపాల వ్యవస్థ కు చేరాయి .1969 లో టోక్యో లో జరిగిన యూపీయూ సమావేశంలో అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవం ప్రకటించారు. తపాలా సేవల ప్రాధాన్యత మనిషి జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.ఆధునిక కమ్యూనికేషన్ పద్ధతి లేక ముందు తపాలే వ్యక్తి భావాలు వార్తలు సంతోషం బాధలు పంపే ప్రధాన సాధనం.అక్షరాల ద్వారా బంధాలను పెంచిమను షులను దగ్గర చేసింది.గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కూడా తపా లా వ్యవస్థ ప్రజలకు ముఖ్యమై న సేవా కొనసాగుతుంది. తపా లా శాఖ కేవలం లేఖలు పంప డమే మాత్రమే కాదు డబ్బు పంపిణీ, బీమా సేవలు,సేవింగ్ అకౌంట్ ,లో పార్సిల్ డెలివరీ, సామాజిక పెన్షన్ల పంపిణీ వంటివిఅందిస్తుంది.భారతదేశ తపాల వ్యవస్థనుమనంగమని స్తే ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్వర్కులలో ఒకటి 1854లో లార్డ్ డాల్హౌసి కాలం లో నే ఇది అధికారికంగాప్రారం భమైంది. భారతదేశంలోని ప్ర తి గ్రామానికి తపాలా శాఖలు చేరుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.అంతర్జాతీయ తపాలా దినోత్సవం జరుపు కోవడం వెనుక ముఖ్య ఉద్దేశా లు తపాలా ఉద్యోగుల కృషిని గుర్తించడం కమ్యూనికేషన్ రంగంలో తపాలా వ్యవస్థ చేసి న సేవలను స్మరించుకోవడం యువతలో లేఖల ద్వారా అనుబంధాలను పెంపొందించే అవశ్యకతను చేర్చడం, తపా లా రంగంలో నూతన సాంకేతి క పరిచయం చేయడం,తపాల వ్యవస్థ గతంలో మనిషి మను షుల మధ్య అనుబంధానికి ప్రతికటా నిలిచింది ఇప్పటికే డిజిటల్ యుగం లో కూడా తపాలా సేవలు తమ విలు వలను కోల్పోలేదు అంతర్జా తీయ తపాల దినోత్సవం మనకు సమాచారం మార్పిడి ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది ఇది మనలోని సాంప్రదాయం విలు వలను నిలబెట్టడం సేవా భా వాన్ని గుర్తు చేయడం వంటి అంశా లను నేర్పుతుంది. తపా ల దినోత్సవం లేఖలతో బంధా లు సేవలతో సమాజమని చెప్పవచ్చు. సాంకేతిక మార్పు లు రాకముందు భారతదేశం లో 15 పైసల కార్డు మరియు ఇన్ ల్యాండ్ లెటర్ చాలా ప్రసిద్ధి చెందినది.నేటి తరం పిల్లలకు పోస్ట్ కార్డ్ తెలవదు గ్యాలరీలో పెట్టి చూపించవ లసిన పరిస్థితి ఏర్పడింది. పోస్టల్ శాఖ ఈ బాధ్యతను తీసుకొని గత నుంచి వర్తమా నం వరకు అందిస్తున్న సేవల ను విద్యార్థి లోకానికి పరిచ యం చేయాలి.పోస్టల్ శాఖ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ లను

విడుదల చేస్తుంది.తపాల బిల్లుల సేకరణ ఒక హాబీగా కూడా ఉంటుంది.ఒక దేశ సాంస్కృతిక, చరిత్ర,భౌగోళిక

సాంకేతిక అభివృద్ధి స్పష్టం అవుతుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!