సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు చేయాలి…

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు చేయాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 10 (అఖండ భూమి న్యూస్);

సమాచార హక్కు చట్టం 2005 ని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్టిఐ 2005 వారోత్సవాలలో భాగంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు మరియు డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ఆర్టిఐ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కార్యక్రమం నిర్వహించి ఆర్టిఐ చట్టం వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను మరియు చట్టం అమలు తీరు, ఆర్టిఐ చట్టంలో ఉన్న అంశాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో పారదర్శకత, జవాబుదారీ తనం ను పెంపొందించేందుకు ఆర్.టి.ఐ చట్టం తీసుకు తీసుకువచ్చారని ఆర్టిఐ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చేలా అన్ని కార్యాలయాల పిఐఓ లు ప్రజలు అడిగిన సమాచారాన్ని ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణీత సమయంలో నిర్ణీత పద్ధతిలో అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఐ చట్టం అమలును ఆర్టిఏ చట్టం మార్గదర్శకాలు ప్రకారం అమలు చేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా అన్న కలెక్టర్ లోకల్ బాడీ చందర్ నాయక్, డిఆర్ఓ మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, సెక్షన్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పిఐఓ లు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!