విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…

విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 05 (అఖండ భూమి న్యూస్);

విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలను సకాలంలో అందించాలి – జిల్లా కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ, సంక్షేమ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలను సకాలంలో కుట్టించి పాఠశాలల వారీగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లాలో యూనిఫాంల కటింగ్ మరియు స్టిచింగ్,పై గాంధారి మండలంలోని యూనిఫాం కటింగ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ మహిళా టైలర్లతో నేరుగా మాట్లాడి, యూనిఫాంల కటింగ్ ప్రక్రియ, పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు, వస్త్రాల లభ్యత, కొలతల ప్రకారం కటింగ్, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మహిళా టైలర్లను అభినందిస్తూ, వారి ద్వారా నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా ప్రతి విద్యార్థికి సరైన కొలతలతో యూనిఫాంలను కుట్టించి, నిర్ణీత గడువులోగా పాఠశాలల వారీగా పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహిళా టైలర్లకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో యూనిఫాంల పంపిణీ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో యూనిఫాంల మొదటి జత పంపిణీ పూర్తయినందుకు సంబంధిత అధికారులను అభినందించారు. మిగిలిన ప్రభుత్వ, సంక్షేమ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న యూనిఫాంల స్టిచింగ్ పంపిణీని వేగవంతం చేసి ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 959 విద్యాసంస్థలు/పాఠశాలలు, హాస్టళ్లలో 89,279 మంది విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన యూనిఫాంలు అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్,ఎల్లారెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి, డీపీఎం, ఏటీఎం తహసీల్దార్, ఎంపీడీవో , ఎంఈఓ వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యాశాఖ, సంక్షేమ శాఖలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!