కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…

కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 05 (అఖండ భూమి న్యూస్);

 

అహర్నిశలు శ్రమించి పలు శాఖల ద్వారా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ లు కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు విడుదల చేశారు.

మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘన సన్మానం ,ఆర్&బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు మంగళవారం తెలిపారు.

కామారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మంత్రులతో సమన్వయం చేసి కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులను సాధిస్తున్నారు అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఆయన నిరంతర కృషి ఫలితంగానే కామారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.75.19 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

ఈ నిధులతో (హమ్ ) ఏజెన్సీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి ఘనంగా సన్మానించి, కామారెడ్డి అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి కోసం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసిన రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఫోన్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ నిధులతో నియోజకవర్గంలోని పలు ప్రధాన రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. త్వరలోనే ఎఫ్‌డీఏ (FDA) నిధుల కింద రూ.25 కోట్లు, మరో రూ.20 కోట్లు, అలాగే సీఆర్‌ఆర్ (CRR) నిధుల కింద అదనంగా రూ.32 కోట్లు కూడా మంజూరు కానున్నాయని వెల్లడించారు.

ముఖ్యమంత్రి నాయకత్వంలో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, గ్రామీణ మౌలిక సదుపాయాలు, రహదారులు, తాగునీరు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అహర్నిశలు శ్రమిస్తూ వివిధ శాఖల మంత్రులతో నిరంతరం సమన్వయం చేసి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభినందించారు.

రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కామారెడ్డిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని షబ్బీర్ తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!