గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
*ఈనెల 7 చివరి గడువు..
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 05 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లోని ఉపాధ్యాయ పోస్టులను పూర్తి తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు ఈనెల 7వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుండి కామారెడ్డి గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకులంలో జేఎల్ – వృక్ష శాస్త్రం (01), పీజీటీ – గణితశాస్త్రం, పీజీటీ – ఫిజిక్స్ (01), పీజీటీ – జీవ శాస్త్రం (01), టీజీటీ – ఆంగ్లం (02), టీజీటీ – ఫిజిక్స్ (01), హన్మాజీపేట (దుర్కి) బాలికల గురుకులంలో జేఎల్ ఫిజిక్స్ (01), రసాయనన శాస్త్రం (01), పీజీటీ – గణితం (02), ఫిజిక్స్ (01), టీజీటీ – తెలుగు (01), టీజీటీ – ఆంగ్లం (02), ఫిజిక్స్ (01), సోషల్ (01), ఆర్ట్ క్రాఫ్ట్ (01), ఫిజికల్ డైరెక్టర్ (01), నాగిరెడ్డిపేట (కామారెడ్డి – సరంపల్లి) టీజీటీ – సోషల్ (01), బాన్సువాడ (నసురుల్లాబాద్) ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ (01), కామారెడ్డి డిగ్రీ కళాశాల (పురుషుల)లో డీఎల్ – ఇంగ్లీష్ (01) ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తో పాటు బీఈడీ, టెట్ పూర్తి చేసి ఉండాలన్నారు. డిగ్రీ కళాశాల అధ్యాపకులు సంబంధిత విభాగంలో పీజీతోపాటు నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పీహెచ్ డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పోస్టుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని పేర్కొన్నారు. మహిళా కళాశాలలో మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.


