42% బీసీ ల రిజర్వేషన్ ల
సాధాన కై మరో ఉద్యమం ..!

ఉస్మానియా యూనివర్సిటీ బిసి జేఏసీ నాయకుడు డాక్టర్ నిర్జన రమేష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 13 (అఖండ భూమి న్యూస్);
ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో అన్ని బీసీ కులాల సంఘాల నాయకులు సోమవారం అత్యవసర సమావేశం కావడం జరిగింది.
ఈ సమావేశం లో బీసీ రిజర్వేషన్ ల సాధనకై తెలంగాణ ఉద్యమం తరహాలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అన్ని యూనివర్సిటీ ల బీసీ విద్యార్ధి సంఘాల నాయకులతో కలుపు కొని రిజర్వేషన్ ల సాధన కోసం ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం అని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం లో వంట వార్పు, సకల జనులు సమ్మె, సాగరహారం, రహదారుల దిగ్బO ధనం, వంటి కార్యక్రమాల లు జరిగాయి. అదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమంను నిర్మిస్తామని దీని కోసం త్వరలో అన్ని బీసీ విద్యార్ధి, యువజన, కుల, సంఘాలతో కలుపుకొని బీసీ జేఏసీ ఏర్పాటు జరుతుందని అన్నారు.
ఈ సమావేశం లో
డా: వట్టి కూటి రామారావు గౌడ్, డా :బొమ్మ హన్మంత్ రావ్ నేత, డా :సాంబ శివ గౌడ్, డా :వీరు యాదవ్, జగన్ ముదిరాజ్, డా:R N శంకర్ యాదవ్, డా:ఏలేందర్ యాదవ్,
మాసంపల్లి అరుణ్ కుమార్, పూసల రమేష్,రామ్ గౌడ్, బొమ్మ కిషోర్ లు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….
రైతాంగానికి అండగా నిలబడదాం..!
శిథిలావస్థలో ఉన్న పాఠశాల అదనపు గదుల కూల్చివేత పనులను పరిశీలించిన తిరుమల్ గౌడ్…


