ప్రజావాణి సమస్యల దరఖాస్తుల సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్…

ప్రజావాణి సమస్యల దరఖాస్తుల సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 13 (అఖండ భూమి న్యూస్);

 

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో పరిష్కారం కోసం వచ్చేసిన ప్రజల నుండి మొత్తం 90 దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో వార్తసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!