బెల్లంపల్లిలో స్వర్గీయ కామ్రేడ్ గుండా మల్లేష్ వర్ధంతి వేడుకలు

బెల్లంపల్లిలో స్వర్గీయ కామ్రేడ్ గుండా మల్లేష్ వర్ధంతి వేడుకలు

 

వాళులర్పించిన భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి

బెల్లంపల్లి అక్టోబర్ 13(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సోమవారం పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన సిపిఐ దివంగత నేత కామ్రేడ్ గుండా మల్లేష్ 5వ వర్ధంతి జరుపుకోవడం జరిగినది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి నాలుగుసార్లు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు వారి యొక్క సేవలను అందించడం జరిగినదన్నారు.వారి ఐదో వర్ధంతి బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని వారున్నారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రాముడు లక్ష్మణ్ గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది.పట్టణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి సభలో మాట్లాడుతూ.. గుండా మల్లేష్ 5వ వర్ధంతి జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో జరుగుతున్నాయని గుండ మల్లేష్ నాటి నుండి తుదిశ్వాస వరకు బడుగు బలహీన పేద వర్గాల ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేశారని గుండా మల్లేష్ మన మధ్యలో లేకపోవడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తీరని లోటుగా ఏర్పడతా ఉన్నదన్నారు. 1983,1985 1994 కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒకసారి మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన గుండా మల్లేష్ భూమిలేని వారికి భూమి ఇచ్చి ఇల్లు లేని వరకు ఇండ్లు పంచినారు. ప్రస్తుత రోజుల్లో సర్పంచ్ గా కౌన్సిలర్ గా గెలిచిన వాళ్లే కోట్లకు పరిగెత్తుతుంటే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుండా మల్లేష్ అవినీతికి తావు లేకుండా నిస్వార్ధంగా ప్రజా శ్రేయసుకు పాటుపడినటువంటి గుండా మల్లేష్ ని ఆదర్శంగా తీసుకొని పార్టీ శ్రేణులు కూడా నిస్వార్ధంగా ప్రజా ప్రయోజనాలపై పాటుపడాలని వారన్నారు.ఎఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ స్వామి మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా శ్రీకృష్ణ కమిటీ మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను సిపిఐ పార్టీ శాసనసభ పక్ష నేతగా తెలంగాణ వాదాన్ని వినిపించి ఆనాడు రాష్ట్ర సాధనలో శక్తివంచనకు తావులేకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాల నిర్మాణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎనలేని సేవలందించినటువంటి గుండా మల్లేష్ ఈరోజు మనలో లేవకపోవడం చాలా బాధాకరమని వారన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ భూటకపు ఎన్కౌంటర్లు జరిగినా అమరుల పార్థివ దేహాలను వారి యొక్క కుటుంబాలకు అప్పగించి అంతిమయాత్రలు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండేవారని, కార్మికుల కోసం కర్షకుల కోసం సంఘటిత అసంఘటిత కార్మికుల కోసం రాజీలేని పోరాటాలు చేశారని తెలంగాణ రైతంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశ సాధనలో గుండా మల్లేష్ ఎనలేని సేవ చేశారని వారన్నారు.జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ..ఆనాటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకత్వం మరియు గుండ మల్లేష్ చేసినటువంటి పోరాటాలు గుర్తుతెచ్చుకొని మరి ఈనాటి ప్రస్తుత పరిస్థితులలో గుండా మల్లేష్ గారు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని వారన్నారు.ఈ కార్యక్రమంలో కామెర మల్లయ్య మాజీ ఎంపీపీ,బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ,మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు గుండా సరోజ,జిల్లా అధ్యక్షులు బొల్లం సోని, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్,పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ బికేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం,డి హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం, అంకుశం సీనియర్ నాయకుడు మూల శంకర్ గౌడ్,బెల్లంపల్లి పట్టణ కౌన్సిల్ సభ్యులు బండారి శంకర్, శనిగారపు రాజేందర్,స్వామి దాస్,రత్నం ఐలయ్య, ప్రభుదాస్,గుండ ప్రశాంత్ గుండా శంకర్,గోలేటి రాయలింగు,కే తిరుపతి,బియ్యాల పద్మ,బూర్ల సమ్మయ్య,లక్ష్మి కిరణ్ తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!