నేడే ఏ.పి. జె. అబ్దుల్ కలాం జయంతి…

నేడే ఏ.పి. జె. అబ్దుల్ కలాం జయంతి…

ఆయన అడుగు జాడల్లో యువత కొనసాగలి:

కవి లెక్చరర్ వైద్య.శేషారావు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; అక్టోబర్ 14 (అఖండ భూమి న్యూస్);

ఆయన ప్రతి అడుగు ఆలోచన భారత దేశాన్ని 2020 వర కు అన్ని రంగాలలో అభివృద్ధిని ఆకాంక్షించారు. మరియు ప్రయత్నించారు.అది నిజం అయిందా అంటే కొంత సందే హం తప్పదు.అవుల్ పకీర్ జైనులొద్దిన్ అబ్దుల్ కలామ్. ఆయన ఒక పడవ నడిపే తండ్రి, తల్లి సాధారణ పేద ఉమ్మడి కుటుంబం లో పుట్టి తండ్రి కి సహాయంగా పేపర్ బాయ్ గా పనిచేసిన కష్ట జీవి.
తల్లి తను చిన్న కొడుకు చదువు కోవడం తో కొంచం ఎక్కువ అన్నం పెట్టేది.మొదట్లో తిరు చిరాపల్లి లో ఎం.ఎస్సి ఫిజిక్స్ పూర్తి చేసిన ఆయనకు సంతృప్తి లేదు.మద్రాస్ యూనివర్సిటీ లో “ఏరో నాటికల్ స్పేస్ ఇంజీనీర్ “పూర్తి చేసినారు.
ఇస్రో లో శాస్త్ర వేత్తగా చేరి అనేక పరిశోధనలకు ఆద్యుడు గా మరినారు. పి.ఎస్.ల్.వి, ఎస్.ఎల్.వి 3 లాంటి స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణుల తయారీ లోకీలకపాత్రవహించారు.1998 లో పోక్రన్ అణు పరీక్షల నిర్వహణలో బాగస్తుడుఅయ్యి అణ్వయుధలు కల్గిన దేశాల స్థానంలో నిల్పినరు.
ది హిస్టరీ ఛానెల్ మరియు జియో ఛానెల్ వారు నిర్వహిం చిన దానిలో 2 వ స్థానంలో ఉంది.ఆయన ముస్లిం గా ఖురాన్ ఎంత చదివేవారో భగవత్ గీత అంతే చదివే వారు.పరమత సాహనం తోపాటు మానవత్వం మెండు గల వాడు 11 వ రాష్ట్రపతిగా 90 శాతం పైగా మెజారిటీ తో ఎన్నికయ్యారు పూర్తి స్థాయిలో కర్తవ్యానిర్వహన తో పనిచేసి వ్యక్తి భారత దేశం లో ఏ ఒక్క వ్యక్తి వ్యతిరేకించని వ్యక్తిత్వం అతనిది.ముస్లిం పద్ధతి ప్రకా రం వివాహం చేసుకోక పోవ డం తప్పు కానీ జీవితాంతం బ్రహ్మచారిగాఉన్నారు.ఆయన శకాహారి. ఒక లక్ష మంది విద్యార్థులతో సంభాషించాలని లక్ష్యం తో పనిచేసినడు బోధన వృత్తి అంటే ఎంతో ఇష్టం రాష్ట్ర పతి తర్వాత ఎన్నో విశ్వవిద్యా లయళ్లలో వివిధ అంశాలపై మాట్లాడినాడు.40 విశ్వవిద్యా లయల నుండి 7 గౌరవ డాక్టరే ట్స్,పద్మభూషణ్,పద్మవిభూషణ్ తో పాటు భారత రత్న కూ డా అందుకున్నారు. ఇవన్నీ ఒకే ఎత్తు కేవలం ఒక డ్రెస్ ,లాప్ టాప్ ,గ్రంథాలు తప్ప ఏమీ ఉంచుకోలేదు.ఎన్నో అద్భు తమైన పుస్తకాలు రాసినారు రు.2015 జులై 27 నాడు షిల్లాంగ్ లో ఐ.ఐ.ఎం లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కుప్పకూలినడు. కలలు కనండి,వాటిని చేరడా నికిప్రయత్నించండి.ఆయన లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న భారతదేశం చేసుకున్న పుణ్య ఫలం.ఆయన ఆశయాలు సాధనకు నిబద్ధతతో కూడిన యువత తో సాధ్యం. అప్పుడే అతనికి నిజమైన జయంతి మరియు నివాళి.ఆయన భారతదేశాన్ని ఏస్థాయిలో ఉహించారో ఆ స్థాయి లో నిలిపే బాధ్యత నిస్సందేహంగా యువతదే.

Akhand Bhoomi News

error: Content is protected !!