18 న బంద్ విజయవంతం చేయాలని బీసీ నాయకుల పిలుపు .. 

18 న బంద్ విజయవంతం చేయాలని బీసీ నాయకుల పిలుపు ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 17 (అఖండ భూమి న్యూస్);

 

ఈనెల 18న శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ కుల సంఘ నాయకులు ఐక్యంగా ఏర్పాటు ఐక్య పోరాటంతోనే 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రకుల నాయకులను హెచ్చరించారు బందుకు అన్ని వాణిజ్య వ్యాపార సంబంధ సముదాయాలను మూసివేసి బందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్రబోయిన స్వామి ,తీగల తిరుమల గౌడ్, కుంచాల శేఖర్, నాగారపు ఎల్లయ్య , సీతారాం మధు, పాలకుర్తి శేఖర్ ,కడారి రమేష్, బొమ్మర శ్రీనివాస్ ,ఎండి షమ్మి, అబ్బయ్య ,కలీం, నహీం, ఆశం ఆసంశెట్టి పోచయ్య, బోడ కుంట రవి,నేతుల సుధాకర్, అబ్రబోయిన రాజు, అబ్రబోయిన రాజయ్య , పుల బోయినశంకర్ , రమేష్ పలువురు బిసి ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!