*ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 17 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు .
పాఠశాల పరిస్థితిని సమీక్షించిన అనంతరం కలెక్టర్ స్వయంగా 10 వ తరగతి విద్యార్థులకు Solar System పై పాఠం బోధించారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులతో చర్చ జరిపి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “పాఠశాలలు విద్యాగణనకు కేంద్ర బిందువులు. ఒక చిన్న మార్పు పిల్లల జీవితాలను మారుస్తుంది. అందుకే తరచూ పాఠశాలలకు వచ్చి విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమవడం అవసరం” అని తెలిపారు.
అలాగే, ఈ పాఠశాల నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సందర్శనకు ఎంపికైన ఇద్దరు విద్యార్థినులను కలెక్టర్ అభినందించి, నోట్ బుక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
పాఠశాల యొక్క స్థితిగతుల పైన అలాగే మధ్యాహ్న భోజన పథకం పై ఆరా తీసి మెను ప్రకారం పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా అనే విషయం అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రాజు,ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ,ఎం.ఈ.ఓ గంగారెడ్డి , ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


