తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకునికి ఘన సన్మానం

తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకునికి ఘన సన్మానం

బెల్లంపల్లి అక్టోబర్ 17(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల ప్రజలందరి ఆధ్వర్యంలో తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా తెలంగాణ కీర్తి అవార్డు అందుకున్న బెల్లంపల్లి పట్టణానికి చెందిన తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్మాన్ పాషను ఘనంగా పూలమాల శాలువా తో సత్కరించుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా కన్నాల గ్రామస్తులు మాట్లాడుతూ..తాజ్ బాబా సేవ సమితి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బెల్లంపల్లి పట్టణానికి కీర్తి పురస్కార్ అవార్డు తెలంగాణ రెవెన్యూ సిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అవార్డుకు కన్నాల గ్రామ ప్రజలందరూ సంతోషిస్తూ తాజ్ బాబా సేవ సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు కన్నాల ప్రజలందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో కన్నాల గ్రామ ప్రజలందరూ తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!