ఆర్డీఓ చేతులమీదుగా రక్తదాతలకు ప్రశంసాపత్రాలు*

*ఆర్డీఓ చేతులమీదుగా రక్తదాతలకు ప్రశంసాపత్రాలు*

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 17 (అఖండ భూమి న్యూస్);

మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టిన ముస్లిం వెల్ఫేర్ కమ్యూనిటీ సభ్యులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. తలసేమియా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, గత నెల సెప్టెంబర్ 14వ తేదీన మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఎల్లారెడ్డిలో ముస్లిం వెల్ఫేర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఈ శిబిరంలో విశేషంగా పాల్గొని రక్తదానం చేసిన కమిటీ సభ్యుల సామాజిక బాధ్యతను గుర్తిస్తూ, శుక్రవారం రోజు ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పార్థసింహారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు జ్యోషి శ్రీధర్ రక్తదానం చేసిన సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పార్థసింహారెడ్డి మాట్లాడుతూ రక్తదానం అనేది మనిషి చేయగల అత్యుత్తమ సేవ. మీలాద్ ఉన్ నబీ సందర్భంగా సమాజానికి ఇలాంటి సేవ చేయడం ఎంతో గొప్ప పని. ముస్లిం వెల్ఫేర్ కమ్యూనిటీ చేసిన ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలవాలి అని అన్నారు. కమ్యూనిటీ నాయకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ కమ్యూనిటీ అధ్యక్షుడు షేక్ గయాజోద్దీన్, ఉపాధ్యక్షుడు ముక్రం అలీ, సయ్యద్ మీర్, క్యాషియర్ షేక్ హైమద్, జాయింట్ సెక్రటరీ హైమద్ పాష, సభ్యులు నయీమ్, మజీద్, అప్రజ్, మస్కుద్ అలీ, సయ్యద్ నజీబ్ ఉల్లా, సద్దాం అలీ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!