పార్టీ సంస్థ గత నిర్మాణానికి బలోపేతం చేయడమే లక్ష్యం*:ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

పార్టీ సంస్థ గత నిర్మాణానికి బలోపేతం చేయడమే లక్ష్యం*:ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి

 

బెల్లంపల్లి అక్టోబర్ 17(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిరుమల హిల్స్ ఆర్పి గార్డెన్ హల్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన సృజన్ అబియన్, టీపీసీసీ ఆదేశాల మేరకు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..పార్టీ సంస్థగత నిర్మాణానికి బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని బలపరిచేందుకు బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం కార్యకర్తలను సమన్వయం చేయడం ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెల కోల్పోవడం వంటి అంశాలపై చర్చ జరిగింది.

జిల్లా కాంగ్రెస్ కమిటీలను మరింత సమర్థవంతంగా బాధ్యతయుతంగా తీర్చిదిద్దడం కార్యకర్తలు సమన్వయం పెంచడం పార్టీ నిర్మాణానికి బలోపేతం చేయడం ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.

ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ

ప్రజల అభిప్రాయాలతో ప్రజల అంగీకారంతో ఎంపిక అవుతుందంటే అది నిజమైన ప్రజాస్వామ్యం ఈ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత శ్రీ రాహుల్ గాంధీ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పరదర్శకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేయడం జరుగుతుందఅన్నారు.అనంతరం టీపీసీసీ అబ్జర్వర్స్ సమక్షంలో దరఖాస్తు ఫారంను విడుదల చేసి,ఏఐసీసీ,అలాగే టిపిసిసి అబ్జర్వర్ కు అందజేశారు. అనంతరం జిల్లా స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా సీక్రెట్ గా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. స్వీకరించిన అభిప్రాయాలను టీపీసీస్ కి సమర్పించనున్నారు.ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవుల జ్యోతి లక్ష్మణ్,పిసిసి అబ్జర్వర్ డాక్టర్ పులి అనిల్ కుమార్,పిసిసి అబ్జర్వర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్,ఎమ్మెల్సీ దండే విటల్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మండలాల అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు,తాజా మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!