ఎల్లారెడ్డి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు…

ఎల్లారెడ్డి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 24 (అఖండ భూమి న్యూస్);

 

ఎల్లారెడ్డి: స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డిలోని *అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏ టి సి) ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడి, అందిస్తున్న విద్యా ప్రమాణాలు శిక్షణా సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ. గత ఐటిఐ కళాశాలను ఆధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌గా మార్చి, రూ.70 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు” తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డిలో ఏ టి సి స్థాపనకు సహకరించిన టాటా గ్రూప్ ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. “ఈ సెంటర్ ద్వారా గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక విద్య అందించే అవకాశం లభిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక కోర్సులు ప్రారంభించి, ఎల్లారెడ్డిని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతాం” అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!