కార్తీకమాసంలో దీపదానం చేస్తే కలిగే లాభాలు…

కార్తీకమాసంలో దీపదానం చేస్తే కలిగే లాభాలు…

 

లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; అక్టోబర్ 24,(అఖండ భూమి న్యూస్);

కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరి పిండితో గానీ, గోధుమ పిండితో గానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆదీపాన్ని పురోహితునికి దానంచెయ్యాలి.

ఇదేవిధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండిప్రమిదలో బంగారపు రంగుతో అంటే. పసుపును పూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణునికి అన్నదానం కూడా చేయండి.

దీపాన్ని దానం చేసేటప్పుడు

సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్సు ఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ”

అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి.

ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. కార్తీకమాసంలో దీపదానం చేస్తే తెలిసి గానీ, తెలియకగానీ చేసిన పాపాలు తొలగిపోతాయి. దీపదానం మహిమను గురించి వివరించే కథ: పూర్వం ద్రవిడ దేశంలో పరమలో భిగా ఓ స్త్రీ జీవించేది. తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్న ఆమహిళ బిచ్చ మెత్తుకుంటూ. తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్లల్లో తింటూ బతికేది. అంతే కాకుండా ఎవరికీ దానధర్మాలు చేయదు.ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్లేది కాద పరమలోభి.శుచి శుభ్రతలేకుండాజీవితాన్నిగడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్న ఆమెకు ఓరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటి నీటితో స్నానంచేసి దీపదానం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది.

అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది.

ఈ కథను వసిష్ఠుడు జనక మహారాజుకు మోక్షమార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!