అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు..!

అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 24 (అఖండ భూమి న్యూస్);

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆర్థికంగా క్షీణించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, ప్రభుత్వాల నిర్లక్ష్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2020–21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో 43.7% కుటుంబాలు, తెలంగాణలో 37.2% కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయినట్లు తేలింది. అంటే ప్రతి రెండింట్లో ఒక కుటుంబం అప్పుల భారంతో నలుగుతున్నదన్న మాట.

ఇది ప్రజల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువవుతున్న సంకేతం. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వ్యవసాయంలో నష్టాలు, విద్యా–ఆరోగ్య రంగాల్లో అధిక వ్యయాలు — ఇవన్నీ సాధారణ కుటుంబాలను అప్పుల పాలవుతున్న దుస్థితికి నెట్టేశాయి. కానీ ప్రజల కష్టాలు తగ్గించే దిశగా ఏ చర్యలూ కనిపించడంలేదు.రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం పేరిట పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నా, వాటి ఫలితం ప్రజల జీవితాల్లో కనిపించడం లేదు. ప్రజల జీవనోపాధి స్థిరపడకపోతే, అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేదు. నిజమైన అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు కాదు ప్రజల ఆర్థిక స్వావలంబన, భరోసా కలిగిన జీవితం.ప్రభుత్వాలు తక్షణమే ఈ గణాంకాలను హెచ్చరికగా తీసుకోవాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!