*రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు వెన్నెల సృజన్…
 
*రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు..
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సృజన్ వెన్నెల దంపతులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులను నిర్వహిస్తున్న వెన్నెల ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడమే కాకుండా దంపతులిద్దరూ రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని,రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ముందుకు రావాలని, సకాలంలో రక్తం దొరకకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయని అన్నారు,రక్తదానం చేసిన దంపతులకు ప్రశంస పత్రాలను అభినందన జ్ఞాపికను అందజేసి అభినందించడం జరిగిందని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్యాతం సిద్ధరాములు,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెంకటేష్,జీవన్ లు పాల్గొనడం జరిగింది.


