ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు..!

*ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు..!

 

ఉపాధి హామీ పనుల హాజరులో అక్రమాలకు చెక్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రతినిధి; అక్టోబర్ 31 (అఖండ భూమి న్యూస్);

ఉపాధి హామీ కూలీల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

హాజరు నమోదు కోసం ప్రధానంగా ఎన్‌ఎంఎంఎస్‌ , ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ లను ఉపయోగిస్తారు.

కూలీలు రోజుకు రెండు సార్లు (ఉదయం 8 గంటలకల్లా, మధ్యాహ్నం 4 గంటలకు) హాజరు నమోదు చేయాలి.

ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా గ్రూప్‌లో ఒకరిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి, వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ హాజరును గుర్తిస్తారు.

ఈ కొత్త విధానం అమలు కోసం జిల్లాలో కూలీల ఈకేవైసీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

నిజంగా పనికి వచ్చే కూలీలు నష్టపోకుండా ఉండేందుకే ఈ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!