ఘనంగా వల్లభాయ్ పటేల్ 15వ జయంతి ఐక్యత ర్యాలీ…

ఘనంగా వల్లభాయ్ పటేల్ 15వ జయంతి ఐక్యత ర్యాలీ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 31 (అఖండ భూమి న్యూస్);

భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో *ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు శుక్రవారం కామారెడ్డి పట్టణంలోనీ మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి జన్మభూమి రోడ్డులో ఉన్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు *ఐక్యతా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ గౌడ్ మరియు జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ , భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అనేక సంస్థానాలు భారతదేశంలో కలవకుండా ఉన్న సమయంలో నాటి హోం మంత్రి ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ అనేక సంస్థానాలను భారత దేశంలో విలీనం చేశాడని, తెలంగాణ రాష్ట్రం కూడా నిజాం కాబందహస్థాల్లో ఉంటే, నిజాం మెడలు వంచి, రజాకార్లను తరిమికొట్టి, స్వతంత్ర భారతదేశంలో తెలంగాణను ఐక్యం చేసిన ధీరోద్ధాత్తుడు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారూ అని , ఆ మహనీయుని 150 వ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా యాత్ర నిర్వహించడం ఆనందదాయం అని అన్నారు. నేటి పౌరులకు ప్రతి ఒక్కరికి ఆ మహనీయుని గొప్పతనం తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!