*భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళుర్పించీనా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 31 (అఖండ భూమి న్యూస్);
భారత దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కామారెడ్డి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ ఫోటోకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ. భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీని, ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఇందిరాగాంధీ గారు దేశానికి అందించిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి గొప్ప పథకాలతో భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారని అన్నారు. ఇందిరా గాంధీ భారతదేశ ఏకైక మహిళా ప్రధానమంత్రిగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు. ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో, తాజా మాజీ కౌన్సిలర్లు, శంకర్ రావు, జూలూరి సుధాకర్, సాయిబాబా, మామిళ్ళ రమేష్, మహేష్, తాటి ప్రసాద్, రంగ రమేష్, నర్సిల్ల మహేష్, యూత్ నాయకులు ఉన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


