ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి….

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి….

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 31(అఖండ భూమి న్యూస్):

దేశంలో విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన గొప్ప ప్రజా నాయకురాలు, తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె మారక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, దేశంలో భూ సంస్కరణలు, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేసిన ఆమె సేవలు దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఆమె చూపిన మార్గంలో పయనించేందుకు కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపు శ్రీనివాస్, అబ్రబోయిన రాజేందర్, అండెం శంకర్ రెడ్డి, సీతారాం మధు ముదిరాజ్, మర్రి శేఖర్, కదిరి గోపాల్ రెడ్డి, షమ్మీ, పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, నేతుల సుధాకర్, సాయబు గారి రాజు, నిమ్మ బాలరాజు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!