ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ లోని ఇందిరాగాంధీ విగ్రహనికి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 న జన్మించి– అక్టోబర్ 31, 1984 మరణించారని, భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి అని ఆమె సేవలను కొనియాడారు. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది అని మీ సేవలను కొనియాడారు. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. ఆమె సేవవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షులు సీతారాం మధు శంకర్ రెడ్డి కదిరి గోపాల్ రెడ్డిమాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, అబ్రబోయిన రాజు మర్రి శేఖర్ కృష్ణారెడ్డి సిద్ధారెడ్డి సుధాకర్ కోఆప్షన్ సభ్యులు ఎండీ షమ్మీ, నాయకులు మహమ్మద్ నయీమ్ , రాజు నర్సింలు, శ్రీనివాస్ రాజేందర్ రాములు రసూల్ బాలరాజ్ సిద్ధ రాములు బాలా సురేందర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


