పీఎం సూర్య కుమార్ ముప్తి బిజిలి యోజన-మోడల్ సోలార్ విలేజ్ పథకంపై కలెక్టర్ సమావేశం…

పీఎం సూర్య కుమార్ ముప్తి బిజిలి యోజన-మోడల్ సోలార్ విలేజ్ పథకంపై కలెక్టర్ సమావేశం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర1 (అఖండ భూమి న్యూస్);

పి యం సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన – మోడల్ సోలార్ విలేజ్ పథకం భాగంగా మోడల్ సోలార్ గ్రామం ఎంపిక కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఏర్పడింది .ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుందని, మార్గదర్శకాల ప్రకారం, ఒక గ్రామం ఎంపికకు అర్హత పొందాలంటే 5000 కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండాలన్నారు (తాజా జనాభా లెక్కల ప్రకారం). ఈ నిబంధనల మేరకు, కామారెడ్డి జిల్లాలోని ఎంపికకు 18 అర్హతగల గ్రామాలు పోటీకి అర్హత పొందాయి.

పోటీ కాలం ముగిసిన అనంతరం అన్ని గ్రామాలలో అత్యధిక సోలార్ వ్యవస్థ శక్తి కలిగిన గ్రామం జిల్లాకు మోడల్ సోలార్ గ్రామంగా ఎంపిక అవుతుంది.

పోటీ కాలం పూర్తయిన తర్వాత

సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద మోడల్ సోలార్ విలేజ్ కామారెడ్డి జిల్లాలోని భిక్నూర్ గ్రామం ఎంపికైనట్లు కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.ఈ పథకంతో అన్ని రకాల ప్రభుత్వ భవనాలకు ఉచితoఘా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. మార్గదర్శకాల ప్రకారం, సోలార్ గ్రామ మార్గదర్శకాలకు అనుగుణంగా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) తయారు చేయాలని సౌర శక్తికి సంబంధించిన అధికారులను ఆదేశించారు. డిపిఆర్ ఆమోదం పొందిన సంవత్సరంలోపు ప్రాజెక్టులు పూర్తిగా అమలు అయ్యేలా చూసుకోవాలని,కామారెడ్డి జిల్లా స్థాయి కమిటీ క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి ఆయన తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!