*కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండించండి…
*ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని రామారావు ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 1 (అఖండ భూమి న్యూస్);
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాల తో ప్రజా ఉద్యమాలను ఆపలేరనీ ఖమ్మం జిల్లా లో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య ఘటన అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు.. కార్యాలయంలో వారి మృతి కి
ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సమావేశంలో మాట్లాడారు. అనేక ప్రజా ఉద్యమాలకు రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిన రామారావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామాల్లో నిన్న తెల్లవారుజామున కాంగ్రెస్ మూకల కిరాయి గుండాలు అత్యంత కిరాతకంగా చంపారు. సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా పార్టీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు . పాతర్లపాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా రెండు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశారు గ్రామంలో రాజకీయంగా సిపిఎం ను ఎదుర్కోలేని కాంగ్రెస్ గుండాలు కిరాయి గుండాలతో చoపించారనీ
సౌమ్యుడు ప్రజలలో కలిసి పోయే మనిషిగా పేరు ఉండి అనేక ఉద్యమాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్వహించిన సందర్భంలో అంకితభావంతో పనిచేశారని చెప్పారు వారి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో cpm పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతిరం, కొత్త నర్సింలు జిల్లా కమిటీ సభ్యులు రేణుక, ముదాం అరుణ్ లు ఉన్నారు.
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!
ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.


