రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న లక్కబత్తిని రవికుమార్..!

*రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న లక్కబత్తిని రవికుమార్..!

*40 వ సారి రక్తదానం..

*అత్యవసర పరిస్థితుల్లో ఉన్న యువకునికి సకాలంలో ప్లేట్ లెట్స్ అందజేత..

*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 9 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిజి హెచ్ వైద్యశాలలో అత్యవసరంగా లింగంపేట్ చెందిన శ్రావణ్ (20) కు ఏ పాజిటివ్ తెల్ల రక్తకణాలు అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్క బత్తిని రవికుమార్ వెంటనే స్పందించి కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో ప్లేట్ లెట్స్ ను అందజేయడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్ నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమైన వ్యక్తి అని కోట్ల రూపాయల డబ్బులు ఉన్న ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి ముందుకు రాని నీటి తరుణంలో తోటి వారి ప్రాణాలను కాపాడాలని ఉద్దేశంతో సంవత్సరంలో నాలుగు సార్లు ఎర్ర రక్త కణాలను మూడుసార్లు తెల్ల రక్త కణాలను అందజేస్తూ సేవ చేయడానికి డబ్బు అవసరం లేదని మంచి మనసు ఉంటే చాలు అనే సందేశాన్ని ఇస్తూ నేటి సమాజానికి ఆదర్శంగా నిలవడం జరిగిందని అన్నారు.

గతంలో ఎన్నో సందర్భాల్లో దూర ప్రాంతాలకు వెళ్లి కూడా సకాలంలో గర్భిణీ స్త్రీల కోసం,వివిధ ఆపరేషన్ల నిమిత్తమై, డెంగ్యూ వ్యాధి బాధితులకు సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచిన రవికుమార్ కు అభినందనలు తెలియజేశారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి యువత ముందుకు రావాలని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!