పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వీడండి
• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
• 3 శానిటేషన్ కార్యదర్శులపై చర్యలు తీసుకోండి
• ప్రమాదకరమైన 52 శునకాలను గార్గేయపురం తరలింపు
కర్నూలు నగరపాలక (అఖండ భూమి న్యూస్) :
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సిబ్బందికి హితవు పలికారు. గురువారం ఆయన లక్ష్మి నగర్, మద్దూర్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న శానిటేషన్ ఇంస్పెక్టర్ చెన్నయతో పాటు ఇద్దరు సానిటేషన్ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో పారిశుద్ధ్య పనులను జాప్యం సహించబోమని, 100% డోర్ టూ డోర్ చెత్తా సేకరణ జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల వచ్చేంతవరకు ఉండరాదని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షక సిబ్బంది అందుబాటులో ఉంటూ, సత్వరమే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజలపై దాడి చేస్తున్న ప్రమాదకరమైన 52 వీధి శునకాలను గార్గేయపురం డంప్‌యార్డుకు తరలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, కార్పొరేటర్ రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



