నూతన మద్యం షాపులు స్థల మార్పిడి కొరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన దోమకొండ యువత …

నూతన మద్యం షాపులు స్థల మార్పిడి కొరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన దోమకొండ యువత …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 21 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డికి వినతి పత్రం శుక్రవారం అందజేశారు. ప్రస్తుతం ఉన్న మద్యం షాపులపై గ్రామస్తులు అభ్యంతరం చేశారని అన్నా రు.

దోమకొండ గ్రామంలోని మద్యం దుకాణాలు ప్రస్తుతం ఉన్న స్థలం వద్ద గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉన్న మద్యం షాపులు స్థలం వద్ద ప్రజలకు ప్రయాణికులకు ఎలాంటి రక్షణ లేదు,

గతంలో ఈ రెండు మద్యం షాపుల వద్ద జరిగిన సంఘటనలు అధికారులకు తెలిసి కూడా కూడలి వద్ద ఉన్న జనావాసాల మధ్యన గ్రామ ప్రజలు ప్రయాణించి చోట పర్మిషన్లు ఇవ్వడం జరిగిందిని అన్నారు.

ఈ కూడలి వద్ద గ్రామ మహిళలు, కాలేజీ విద్యార్థులు,స్కూల్ పిల్లలు ఆర్టీసీ బస్సులలో, ఆటోలలో, స్కూల్ బస్సులలో, ప్రయాణిస్తుంటారని అన్నారు.

ఈ మద్యం షాపుల వలన వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ప్రమాదాలకు గురిచేస్తున్నాయి .

కావున ఈమధ్య షాపులను జనావాసాలు లేని చోట ప్రజలకు అంతరాయం కలిగించని చోట ఊరి చివరన ఏర్పాటు చేయించేలా చూడాలని కోరుతున్నాట్లు తెలిపారు.

విజ్ఞప్తి పత్రాన్ని దోమకొండ అధికారులైన ఎమ్మార్వో , ఎక్సైజ్ సీఐ కామారెడ్డి ప్రజావాణి కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడం కూడా అందజేయడం జరిగిందాని అన్నారు.

 

ప్రభుత్వ అధికారులు సానుకూల స్పందన కనిపించక పోవడంతో. దోమకొండ యువత కామారెడ్డి శాసనసభ్యుల దృష్టికి తీసుకు తీసుకువచ్చారు. మా ఈ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించగలరని దోమకొండ గ్రామ స్థానిక యువత ఎర్వ వేణుమాధవ్ రాగుల నరేష్ గౌడ్ భూపాల రాహుల్ ఎర్వ వెంకటేష్ రాగుల శ్రావణ్ గౌడ్

కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!