డిసెంబర్ 1న ముదిరాజుల భారీ నిరసన* 

*డిసెంబర్ 1న ముదిరాజుల భారీ నిరసన*

_జాతీయ రహదారుల దిగ్బంధం

_బీసీ ఏ గ్రూప్ లో చేర్చకుంటే ఆందోళన ఉధృతం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 21 (అఖండ భూమి న్యూస్);

డిసెంబర్ 1న కామారెడ్డి జిల్లాలోని రెండు జాతీయ రహదారులను ముదిరాజులు దిగ్బంధం చేస్తున్నారని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భూపాల్ విజయానంద్, ప్రధాన కార్యదర్శి బొక్కల వేణు, కోశాధికారి లీగల్ అడ్వైజర్ ఎం రవీందర్, ఉపాధ్యక్షులు గోపాల్ తెలిపారు. కామారెడ్డి లో వారు విలేకరులతో మాట్లాడారు. ముదిరాజు లను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డీ గ్రూప్ నుండి ఏ గ్రూపులో చేర్చుతామని ఎన్నికల హామీ ఇచ్చిందని ఇప్పటివరకు రెండేళ్లు గడుస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీసీ ఏ గ్రూపులో చేర్చాలని కోరుతూ డిసెంబర్ ఒకటిన కామారెడ్డి జిల్లాలోని రెండు జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తున్నట్లు ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు పేర్కొన్నారు. ముదిరాజులను బీసీ ఏ గ్రూపులో చేర్చకుంటే రిజర్వేషన్లు కల్పించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లాలో రెండు జాతీయ రహదారులను డిసెంబర్ ఒకటిన ముట్టడించి చేసి రవాణా వ్యవస్థను దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభిస్తామని తెలిపారు.50 లక్షల మంది ముదిరాజులు జాతీయ రహదారులపై నిలిచి నిరసన తెలుపుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీఏ గ్రూపులో చేర్చే హామీ అమలు చేయకుంటె

దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా రాకపోకలను స్తంభింప చేస్తామని ముదిరాజులు నిరసన వ్యక్తం చేస్తారని వారు తెలిపారు. ముదిరాజు లను బీసీఏ గ్రూపులో చేర్చుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వివిధ రూపాల్లో ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని కామారెడ్డి జిల్లా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు విజయానంద్ వేణు రవీందర్ గోపాల్ తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!