• అంతరాష్ట్ర దొంగ నోట్ల తయారీ, చలామణి చేసిన ముఠాలోని ఒకరిపై పిడియాక్ట్ అమలు …
• దొంగ నోట్ల తయారీ, చలామణి చేసిన రెండు కేసుల్లో నిందితుడికి నిర్బంధ ఉత్తర్వులు..
• ఒక సంవత్సర కాలం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం..
తరచూ నేరాలకు పాల్పడుతున్న వారికి పి.డి యాక్ట్ తప్పదు..
జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 21 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణ పిఎస్ పరిధిలోని వైన్స్‌లో రెండు నకిలీ రూ 500 నోట్లు వినియోగించిన ఘటనపై మేకల అఖిల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సి ఆర్ నెంబర్ .551/2025, యు/ఎస్179, 318(4) బి.ఎన్.ఎస్. కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన జిల్లా పోలీసులు తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 8 మంది నిందితులను 11.10.2025 నాడు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ప్రధాన నిందితుడు కరెన్సీ కాట్ని @ లఖన్ కుమార్ దుబే (33) మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇట్టి నిందితునిపై కామారెడ్డి మరియు కోల్‌కతాలో కూడా కేసులు నమోదు అయినవి. ప్రస్తుతం ఇతను నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్, కామారెడ్డి జారీ చేసిన పి.డి యాక్ట్ ఉత్తర్వులను, కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, హెడ్ కానిస్టేబుల్ వి.ఎల్. నర్సింలు శుక్రవారం జైలులో ఉన్న నిందితునికి అధికారికంగా అందజేశారు.
ఈ నిందితుడు ఫేక్ కరెన్సీ చలామణి ద్వారా ప్రజల్లో భయం, అనిశ్చితిని సృష్టిస్తూ, సమాజ అశాంతి నెలకొల్పుతున్న నేపథ్యంలో, తిరిగి శాంతి, భద్రతను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో పిడి యాక్ట్‌ను అమలు చేయడం జరిగిందని అన్నారు. ఈ చట్టం ప్రకారం నిందితుడు ఒక సంవత్సరం వరకు నిర్బంధంలో ఉండే అవకాశం ఉంది.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతు.
అమాయక ప్రజలను మోసం చేసి, నేరస్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అక్రమంగా డబ్బులు సంపాదించేలా తరచూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవు. సమాజంలో అస్థిరత, భయం సృష్టించే వారిని నిర్బంధించేందుకు పిడి యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. నేరాలు మానుకుని బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని అన్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ ఎలాంటి వెనుకంజ వేయలేదని అని స్పష్టం చేశారు.
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


