మంత్రి సీతక్క కాన్వాయ్ ని అడ్డుకున్న వారిపై తక్షణమే ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి…

మంత్రి సీతక్క కాన్వాయ్ ని అడ్డుకున్న వారిపై తక్షణమే ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 21 (అఖండ భూమి న్యూస్);

 

మంత్రి సీతక్క కాన్వాయ్ ని అడ్డుకున్న వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టి కేసులు నమోదు చేయాలని (ఎల్ హెచ్ పి ఎస్) జిల్లా అధ్యక్షులు సునావత్ గణేష్ నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు.

మంత్రి సీతక్క కాన్వాయ్ ని అడ్డుకున్న వారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని *ఆదివాసి కాంగ్రెస్ పార్టీ (ఎస్టీ సెల్ డిపార్ట్మెంట్) జిల్లా అధ్యక్షులు రాణా ప్రతాప్ రాథోడ్ గారు ,లంబాడా హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పిఎస్) జిల్లా అధ్యక్షు.కామారెడ్డి జిల్లా కమిటి తరుపున కామారెడ్డి జిల్లా పోలీస్ ఉన్నంత అధికారులను కోరారు,

గురువారం రోజున సిరికొండ మండలం పాకాల గ్రామంలో అతి చిన్న వయసులో ఎవరెస్టు శిఖరం ఎక్కిన పూర్ణ తండ్రి దేవదాస్ చనిపోయినందుకు మాలోత్ పూర్ణ వారి కుటుంబ సభ్యులను పమర్శించడానికి ధైర్యము ,భరోసా ఇవ్వడానికి వెళ్తున్న జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కాన్వాయ్ ను రామారెడ్డి దుర్గా వైన్స్ లో మద్యం సేవిస్తూ , మాటుగాచి దుర్గా వైన్స్ ఎదురుగా వైస్ లోపలి నుండి హఠాత్తుగా సీతక్క కాన్వాయ్ పై మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి కొంతమంది బి,ఆర్,ఎస్ నాయకుల వారి అనుచరులతో రైతు ముసుగులో శీతక్క కాన్వాయ్ ను ఆకస్మతుగా ఎదురుగా వచ్చి అడ్డుకున్నారు అని అన్నారు.దీని వెనకాల ఎల్లారెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ హస్తము ఉందని వారి పైన కూడా కేసు నమోదు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ని కోరుతున్నాం అన్నారు. కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి డ్రైవర్ కంట్రోల్ చేయకపోతే పెద్ద ప్రమాదం జరిగేది దానికి గిరిజన మంత్రి సీతక్కను బద్నాము చేయాలని మాజీ ఎంపీపీ అగ్రవర్ణ దశరథ్ రెడ్డి పడిగల శ్రీనివాస్ కొంతమంది అనుచరులతో అడ్డు రావడం దారుణం అన్నారు.

గిరిజన అమ్మాయి పూర్ణ ను పరామర్శించడానికి జీర్ణించుకోలేక ఇటువంటి పాల్పడిన సంఘటనకు చింతిస్తున్నాం అన్నారు.

అడ్డుకున్న వ్యక్తులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు ఉన్నంత అధికారులకు కోరారు, లేనియెడల నారెడ్డి దశరథ్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బద్రి నాయక్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి నాయక్ , టౌన్ ప్రెసిడెంట్ రొతవన్ మోహన్ నాయక్

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి డివిజన్ అధ్యక్షులు సదర్నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!