కోటి దీపోత్సవం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్…

కోటి దీపోత్సవం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 21 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ది రామేశ్వర దేవాలయంలో కోటి దీపోత్సవం సందర్భంగా జరిగిన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో కలెక్టర్ గారికి ఘన స్వాగతం పలికారు.

కలెక్టర్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవం లో పాల్గొన్నారు.

అనంతరం దేవాలయ పరిసరాలు, భక్తుల సౌకర్యాలు, నిర్వహణ అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.

కోటీ దీపోత్సవం సందర్భంగా ఆలయంలో దీపాల వెలుగులతో విశేషమైన వాతావరణం నెలకొంది.

Akhand Bhoomi News

error: Content is protected !!